Monday, December 22, 2008

అలమేల్మంగా శతకము 38 alamElmaMgA Satakamu 38

పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచమంతకున్
తల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ
చల్లని చూపు చిల్కి వెదజల్లగ పుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీవధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా !


pallavapANi viSwagurubhAmini yiTTi prapaMchamaMtakun
talli samastajIvulanidhAnama SrIyalamElumaMga nI
challani chUpu chilki vedajallaga puNyulamaiti maMDru bhU
mellanu nIvadhUmaNi nanEkavidhaMbula vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 37 alamElmaMgA Satakamu 37

జాగరమేల జేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ
భోగపైశ్రంబులకు భూషణమై యలమేలుమంగ నీ
యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా
యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా !

jAgaramEla jEsedavu chaMdranibhAnana pavvaLiMpu nI
bhOgapaiSraMbulaku bhUshaNamai yalamElumaMga nI
yOgaviyOgalIla lani yOgikanyalu nIvadhUTi nA
yAgati bujjagiMturu mahAvinayaMbuna vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 36 alamElmaMgA Satakamu 36

ఓ కమనీయకంజముఖి ! యో వలరాయనితల్లి! యోసుధా
సైకతచాతురీజఘన చక్రిణి ! యోయలమేలుమంగ ! నీ
వే కరుణించి కావుమని వేడ్కల నింద్రపురంధ్రు లందఱున్
బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతిసేతురు వేంకటేశ్వరా !

O kamanIyakaMjamukhi ! yO valarAyanitalli! yOsudhA
saikatachAturIjaghana chakriNi ! yOyalamElumaMga ! nI
vE karuNiMchi kAvumani vEDkala niMdrapuraMdhru laMda~run
baikoni nIlatApratima brastutisEturu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 35 alamElmaMgA Satakamu35

.......... గుజ్జెన గూళ్ళును బైడిపొళ్ళు మా
యమ్మకు బొమ్మరిళ్ళు లలితాంగికి మాయలమేలుమంగకున్
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్
నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా !

.......... gujjena gULLunu baiDipoLLu mA
yammaku bommariLLu lalitAMgiki mAyalamElumaMgakun
bommalu bommapottikalu bOnapudoMtu laTaMchu nIsatin
nemmi bhajiMchi mrokkuduru nirjarakAMtalu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -34 alamElmaMgA Satakamu -34

పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం
బడర(గ( గౌనుదీగ నులియన్ ................ నన్
సడివడి యెంతవేగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ
వెడవగు మోముజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా !

peDamara chUchi chUpu jaLipiMchina neTlu dhariMtuvO priyaM
baDara(ga( gaunudIga nuliyan ................ nan
saDivaDi yeMtavEguduvo chakkani SrIyalamElumaMga nI
veDavagu mOmujUchi nagi vennela challina vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -33 alamElmaMgA Satakamu -33

కొలదికిమీఱు ( గ్రొవ్విరులు కొప్పున(జాఱగ( జూపుకన్నుల(న్)
గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె
న్నెలనును(దీగయై కళలునించిన పుత్తడి బొమ్మయై నినుం
గలికి కరంబునం జెనయ(గంటిరిగా తమి వేంకటేశ్వరా !

koladikimI~ru ( grovvirulu koppuna(jA~raga( jUpukannula(n)
gulukuchu nuMDa nennuduTikuMkumatO nalamElumaMga ve
nnelanunu(dIgayai kaLaluniMchina puttaDi bommayai ninuM
galiki karaMbunaM jenaya(gaMTirigA tami vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -32 alamElmaMgA Satakamu -32

తిరుమగు మంచి కుందనపు(దీగపయిన్ ఘనచక్రవాకముల్
పరిగినరీతి( జన్నుగవ భావముతో నలమేలుమంగ నీ
యురముపయిం జెలంగ(గని యోగిజనంబులు నీలమేఘవి
స్ఫురణముతోడి మిం చనుచు(జూచి నుతింతురు వేంకటేశ్వరా !

tirumagu maMchi kuMdanapu(dIgapayin ghanachakravAkamul
pariginarIti( jannugava bhAvamutO nalamElumaMga nI
yuramupayiM jelaMga(gani yOgijanaMbulu nIlamEghavi
sphuraNamutODi miM chanuchu(jUchi nutiMturu vEMkaTESwarA !