Friday, July 11, 2008

అలమేల్మంగా శతకము -22 alamElmaMgA Satakamu -22


కస్తురి పచ్చకప్పురము( గమ్మని పుప్పొడి ధూళ్ళు హత్తి శ్రీ
హస్తమునందు(తట్టుపును(గందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబుల( గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమున( కౌగిటిపాన్పున వేంకటేశ్వరా!


kasturi pachchakappuramu( gammani puppoDi dhULLu hatti SrI
hastamunaMdu(taTTupunu(gaMduchu SrIyalamElumaMga bhA
rastanavaibhavaMbula( garaMguchu ninnu ga~raMga mettu nI
kaustubharatna saudhamuna( kaugiTipAn&puna vEMkaTESwarA!

Tuesday, July 8, 2008

అలమేల్మంగా శతకము -21 alamElmaMgA Satakamu -21

కుంకుమ కస్తురీ ప్రభ బుగుల్కొన( జెక్కుల( జార దివ్యతా
టంకమణిప్రభా ప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపగనె జల్లనె( జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ము( బులకాంకురకోటులు వేంకటేశ్వరా !


kuMkuma kasturI prabha bugulkona( jekkula( jAra divyatA
TaMkamaNiprabhA prativiDaMbamutO nalamElumaMga bhrU
jaMkela naMdaliMpagane jallane( jittamu nIku naMtalO
naMkana miMchu mimmu( bulakAMkurakOTulu vEMkaTESWarA !

అలమేల్మంగా శతకము -20 alamElmaMgA Satakamu -20

లలితపు కంకణాంకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం
బులు మణినీలకాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు
బ్బల ప్రెనువ్రేగుతో( దుఱుముభారముతో నిను( జేరవచ్చు నం
దెలు మెలనూలు ఘంటలు( బ్రతిధ్వనులీనగ వేంకటేశ్వరా !


lalitapu kaMkaNAMkaladhwani ghallani mrOya nuMgaraM
bulu maNinIlakAMtula prabhutwamutO nalamElumaMga gu
bbala prenuvrEgutO( du~rumubhAramutO ninu( jEravachchu naM
delu melanUlu ghaMTalu( bratidhwanulInaga vEMkaTESwarA !


Monday, July 7, 2008

అలమేల్మంగా శతకము -19 alamElmaMgA Satakamu -19


పక్ష్మలనేత్ర ! యోచిలకపల్కుల కల్కి ! సరోజవల్లి ! యో
లక్ష్మి లతాంగి యోబహుకళావతి యోయలమేలుమంగ నీ
సూక్ష్మ వివేక లీలలకు( జొక్కితి నంచు నఖేందువల్లికా
లక్ష్మివికాసత సతి(జెలంగగజేతువు వేంకటేశ్వరా !


pakshmalanEtra ! yOchilakapalkula kalki ! sarOjavalli ! yO
lakshmi latAMgi yObahukaLAvati yOyalamElumaMga nI
sUkshma vivEka lIlalaku( jokkiti naMchu nakhEMduvallikA
lakshmivikAsata sati(jelaMgagajEtuvu vEMkaTESwarA !

Sunday, July 6, 2008

అలమేల్మంగా శతకము -18 alamElmaMgA Satakamu -18


లోలవిలోలనేత్రకు( దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్
మేలిమి( జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్
నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను
న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా !


lOlavilOlanEtraku( daLukkuna ~reppalu vaMchi yettinan
mElimi( jekkuTaddamula mElamulai yalamElumaMgakun
nIlapayOdapuMdu~rumu niggutaTillatalE yaTaMchu nu
nmIlanimIlanaMbulake mettuvu nIvunu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -17 alamElmaMgA Satakamu -17

అతడె నీవు, నీవనగ నాతడు, నీపలుకే తలంపగా
నాతనిపల్కు 'నీ హృదయ మాతడె పో ' యలమేలుమంగ నీ
చేతిదె సర్వజంతువుల జీవనమంతయు నంచు సన్ముని
వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా !


ataDe nIvu, nIvanaga nAtaDu, nIpalukE talaMpagA
nAtanipalku 'nI hRdaya mAtaDe pO ' yalamElumaMga nI
chEtide sarwajaMtuvula jIvanamaMtayu naMchu sanmuni
vrAtamu sannutiMchu nanivAraNa nIsati vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -16 alamElmaMgA Satakamu -16

నించిన పంచదారలును నేతులు దేనెలు( గమ్మ గా(గ( దా
లించినకూరలున్ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్ప(గ నారగింతు నీ
మించిన వేయిచేతులను మేలములాడుచు వేంకటేశ్వరా !


niMchina paMchadAralunu nEtulu dEnelu( gamma gA(ga( dA
liMchinakUralun barimaLiMchaga nayyalamElumaMga va
DDiMchina nirmalAnnamulu DeMda melarpa(ga nAragiMtu nI
miMchina vEyichEtulanu mElamulADuchu vEMkaTESwarA !



related post:


అలమేల్మంగా శతకము -15 alamElmaMgA Satakamu -15

తలచు( గరంగు మైమఱచు( దన్మయ మందును జిత్తజాగ్నిని
న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ,
వలిగిననంతనే కడు( బ్రియంబిక నేమని చెప్పనేడువో
కలిగిన మింతయు( బ్రకాశము తోచెడు వేంకటేశ్వరా !


talachu( garaMgu maima~rachu( danmaya maMdunu jittajAgnini
nnalayuchu dUru nussuranu narmilitO nalamElumaMga nI,
valiginanaMtanE kaDu( briyaMbika nEmani cheppanEDuvO
kaligina miMtayu( brakASamu tOcheDu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -14: alamElmaMgA Satakamu -14

తొలకరిమించు తొయ్యలి వధూమణి చక్కని తల్లి మానినీ
తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ
సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్
పలుకగ నిన్నుజూచి నగు(బైకొని నీసతి వేంకటేశ్వరా!


tolakarimiMchu toyyali vadhUmaNi chakkani talli mAninI
tilakama dEvadEvuni satImaNi yOyalamElumaMga nI
solapulachUpulE vibhunichUpulaviMdu laTaMchu nechchelul
palukaga ninnujUchi nagu(baikoni nIsati vEMkaTESwarA!

అలమేల్మంగా శతకము -13: alamElmaMgA Satakamu -13

చెదిరిన చిన్ని లేగురులు చెక్కున జాఱగ ముద్దుమోముతో
వదలిన కొప్పుతోడ నిడువాలిక కన్నులు నిగ్గు దేఱగా
నుదుటున నిన్ను గూడి మహిమోన్నతితో నలమేలుమంగ నీ
యెదుట మనోజసంపదల నేగతి నుండెనొ వేంకటేశ్వరా!


chedirina chinni lEgurulu chekkuna jA~raga muddumOmutO
vadalina kopputODa niDuvAlika kannulu niggu dE~ragA
nuduTuna ninnu gUDi mahimOnnatitO nalamElumaMga nI
yeduTa manOjasaMpadala nEgati nuMDeno vEMkaTESwarA!