Monday, December 22, 2008

అలమేల్మంగా శతకము 38 alamElmaMgA Satakamu 38

పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచమంతకున్
తల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ
చల్లని చూపు చిల్కి వెదజల్లగ పుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీవధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా !


pallavapANi viSwagurubhAmini yiTTi prapaMchamaMtakun
talli samastajIvulanidhAnama SrIyalamElumaMga nI
challani chUpu chilki vedajallaga puNyulamaiti maMDru bhU
mellanu nIvadhUmaNi nanEkavidhaMbula vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 37 alamElmaMgA Satakamu 37

జాగరమేల జేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ
భోగపైశ్రంబులకు భూషణమై యలమేలుమంగ నీ
యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా
యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా !

jAgaramEla jEsedavu chaMdranibhAnana pavvaLiMpu nI
bhOgapaiSraMbulaku bhUshaNamai yalamElumaMga nI
yOgaviyOgalIla lani yOgikanyalu nIvadhUTi nA
yAgati bujjagiMturu mahAvinayaMbuna vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 36 alamElmaMgA Satakamu 36

ఓ కమనీయకంజముఖి ! యో వలరాయనితల్లి! యోసుధా
సైకతచాతురీజఘన చక్రిణి ! యోయలమేలుమంగ ! నీ
వే కరుణించి కావుమని వేడ్కల నింద్రపురంధ్రు లందఱున్
బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతిసేతురు వేంకటేశ్వరా !

O kamanIyakaMjamukhi ! yO valarAyanitalli! yOsudhA
saikatachAturIjaghana chakriNi ! yOyalamElumaMga ! nI
vE karuNiMchi kAvumani vEDkala niMdrapuraMdhru laMda~run
baikoni nIlatApratima brastutisEturu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము 35 alamElmaMgA Satakamu35

.......... గుజ్జెన గూళ్ళును బైడిపొళ్ళు మా
యమ్మకు బొమ్మరిళ్ళు లలితాంగికి మాయలమేలుమంగకున్
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్
నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా !

.......... gujjena gULLunu baiDipoLLu mA
yammaku bommariLLu lalitAMgiki mAyalamElumaMgakun
bommalu bommapottikalu bOnapudoMtu laTaMchu nIsatin
nemmi bhajiMchi mrokkuduru nirjarakAMtalu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -34 alamElmaMgA Satakamu -34

పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం
బడర(గ( గౌనుదీగ నులియన్ ................ నన్
సడివడి యెంతవేగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ
వెడవగు మోముజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా !

peDamara chUchi chUpu jaLipiMchina neTlu dhariMtuvO priyaM
baDara(ga( gaunudIga nuliyan ................ nan
saDivaDi yeMtavEguduvo chakkani SrIyalamElumaMga nI
veDavagu mOmujUchi nagi vennela challina vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -33 alamElmaMgA Satakamu -33

కొలదికిమీఱు ( గ్రొవ్విరులు కొప్పున(జాఱగ( జూపుకన్నుల(న్)
గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె
న్నెలనును(దీగయై కళలునించిన పుత్తడి బొమ్మయై నినుం
గలికి కరంబునం జెనయ(గంటిరిగా తమి వేంకటేశ్వరా !

koladikimI~ru ( grovvirulu koppuna(jA~raga( jUpukannula(n)
gulukuchu nuMDa nennuduTikuMkumatO nalamElumaMga ve
nnelanunu(dIgayai kaLaluniMchina puttaDi bommayai ninuM
galiki karaMbunaM jenaya(gaMTirigA tami vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -32 alamElmaMgA Satakamu -32

తిరుమగు మంచి కుందనపు(దీగపయిన్ ఘనచక్రవాకముల్
పరిగినరీతి( జన్నుగవ భావముతో నలమేలుమంగ నీ
యురముపయిం జెలంగ(గని యోగిజనంబులు నీలమేఘవి
స్ఫురణముతోడి మిం చనుచు(జూచి నుతింతురు వేంకటేశ్వరా !

tirumagu maMchi kuMdanapu(dIgapayin ghanachakravAkamul
pariginarIti( jannugava bhAvamutO nalamElumaMga nI
yuramupayiM jelaMga(gani yOgijanaMbulu nIlamEghavi
sphuraNamutODi miM chanuchu(jUchi nutiMturu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -31 alamElmaMgA Satakamu -31

పరిమళమో కదంబమొ ప్రభల్ విడ నించిననిగ్గొ నిర్మలా
భరణమొ నిత్యవైభవమొ భాగ్యమొ శ్రీయలమేలుమంగ భూ
ధరునకు నాదిలక్ష్మి యని తత్త్వమహత్త్వరహస్యవేత్తలం
బరమున నుండి నీవనిత( బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా !

parimaLamO kadaMbamo prabhal viDa niMchinaniggo nirmalA
bharaNamo nityavaibhavamo bhAgyamo SrIyalamElumaMga bhU
dharunaku nAdilakshmi yani tattwamahattwarahasyavEttalaM
baramuna nuMDi nIvanita( brastuti sEturu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -30 alamElmaMgA Satakamu -30

ఏ చతురత్వ మేమహిమ మేమి విలాస మదేమి విభ్రమం
బీ చెలువంపు సంపదయు నిందుముఖుల్ జగదేకమోహినుల్
చూచి తలంట వేడ్కపడి చూతురు నీయలమేలుమంగ లీ
లాచికురంపు( గ్రుమ్మెడి కెలంకుల నిగ్గులు వేంకటేశ్వరా !

E chaturatwa mEmahima mEmi vilAsa madEmi vibhramaM
bI cheluvaMpu saMpadayu niMdumukhul jagadEkamOhinul
chUchi talaMTa vEDkapaDi chUturu nIyalamElumaMga lI
lAchikuraMpu( grummeDi kelaMkula uvEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -29 alamElmaMgA Satakamu -29

వెలది మహాపరాధములు వేయును జేసితి గావుమన్న నీ
పులకలు మేనిఘాతలును బూతలు జూ చలమెలుమంగ నీ
యలకలు దీర్చి చెక్కు చెమ టల్లన గోళ్ళను జిమ్మి పయ్యెదన్
బలుచని నవ్వుతో విసరు( బై చెమటారగ వేంకటేశ్వరా !


veladi mahAparAdhamulu vEyunu jEsiti gAvumanna nI
pulakalu mEnighAtalunu bUtalu jU chalamelumaMga nI
yalakalu dIrchi chekku chema Tallana gOLLanu jimmi payyedan
baluchani navvutO visaru( bai chemaTAraga vEMkaTESwarA !

Saturday, October 11, 2008

అలమేల్మంగా శతకము -28 alamElmaMgA Satakamu -28

మంగళమమ్మకున్ సకలమంగళ మంబుజనేత్రికిన్ జయా 
మంగళ మిందిరా సతికి మంగళమీయలమేలుమంగకున్ 
మంగళమందు నే మరియు మంగళమందును దేవలోక ది 
వ్యాంగనలెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా !
maMgaLamammakun sakalamaMgaLa maMbujanEtrikin jayA 
maMgaLa miMdirA satiki maMgaLamIyalamElumaMgakun 
maMgaLamaMdu nE mariyu maMgaLamaMdunu dEvalOka di 
vyAMganalella nIsatiki nAratu litturu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -27 alamElmaMgA Satakamu -27

యో చెలి! యో లతాప్రతిమ! యో మృగలోచన! యోచకోరిరో! 
యో చదులాల ! యోచిలుక ! యో..యలమేలుమంగ నీ 
చూచిన చూపులే విభుడు చూచినచూపులటంచు నీసతిన్
ఖేచరసిద్ధి కామినులు కీర్తన సేతురు వేంకటేశ్వరా!
yO cheli! yO latApratima ! yO mRgalOchana ! yOchakOrirO ! 
yO chadulAla ! yOchiluka ! yO..yalamElumaMga nI 
chUchina chUpulE vibhuDu chUchinachUpulaTaMchu nIsatin 
khEcharasiddhi kAminulu kIrtana sEturu vEMkaTESwarA!

అలమేల్మంగా శతకము -26 alamElmaMgA Satakamu -26

పాయని జాజిపువ్వులనే పట్టుక బాయ ......
........రాహుతుడావైనపు డాయలమేలుమంగ ని
శ్శ్రేయసలక్ష్మి నీశరము చెంగట నొప్పె(దురుష్క దేసబి
బ్బీయెలపువ్వు పయ్యెదనె ప్రేమపునువ్వున వేంకటేశ్వరా !

pAyani jAjipuvvulanE paTTuka bAya ...... ........rAhutuDAvainapu DAyalamElumaMga ni SSrEyasalakshmi nISaramu cheMgaTa noppe(durushka dEsabi bbIyelapuvvu payyedane prEmapunuvvuna vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -25 alamElmaMgA Satakamu -25

దుగ్ధపయోధికన్య జలధుల్ జగముల్ దనకుక్షినున్న సు 
స్నిగ్ధకృశోదరాంగి తులసిం బ్రియురాలలమేలుమంగ 
యీ ...... ..... .... నుచు నిన్ను మునీంద్ర కన్యకల్ 
దిగ్ధరణీధరంబుల నుతింతురు నవ్వుచు వేంకటేశ్వరా !
dugdhapayOdhikanya jaladhul jagamul danakukshinunna su snigdhakRSOdarAMgi tulasiM briyurAlalamElumaMga 
yI ...... ..... .... nuchu ninnu munIMdra kanyakal digdharaNIdharaMbula nutiMturu navvuchu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -24 alamElmaMgA Satakamu -24

ఒక్కొక్కనాటిరాత్రి సకలోన్నుతుడైన ఖగేంద్ర మూర్తిపై  
నెక్కి వొనోదలీల( జరియించుచు నయ్యలమేలుమంగ మో
మక్కున( జేర్చుచు బహువిహారముల వనవీథులంబ్రియం 
బెక్కువగా( జెలంగువిధ మే మని చెప్పుదు వేంకటేశ్వరా !
okkokkanATirAtri sakalOnnutuDaina khagEMdra mUrtipai  
nekki vonOdalIla( jariyiMchuchu nayyalamElumaMga mO 
makkuna( jErchuchu bahuvihAramula vanavIthulaMbriyaM 
bekkuvagA( jelaMguvidha mE mani cheppudu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -23 alamElmaMgA Satakamu -23

అందపు కోసి యిమ్ము విరు లంచును జే రలమేలుమంగ ని 
న్నుందగ(గోర జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న 
య్యందుముఖిం బ్రియంబలర నెత్తుచు పువ్వులు కోయజేయ ని 
ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా !


aMdapu kOsi yimmu viru laMchunu jE ralamElumaMga ni 
nnuMdaga(gOra jekkulaTu nokkina nAkunu naMdavaMchu na 
yyaMdumukhiM briyaMbalara nettuchu puvvulu kOyajEya ni 
shyaMdamaraMdagharmarasasaMgatu labbenu vEMkaTESwarA !

Friday, July 11, 2008

అలమేల్మంగా శతకము -22 alamElmaMgA Satakamu -22


కస్తురి పచ్చకప్పురము( గమ్మని పుప్పొడి ధూళ్ళు హత్తి శ్రీ
హస్తమునందు(తట్టుపును(గందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబుల( గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమున( కౌగిటిపాన్పున వేంకటేశ్వరా!


kasturi pachchakappuramu( gammani puppoDi dhULLu hatti SrI
hastamunaMdu(taTTupunu(gaMduchu SrIyalamElumaMga bhA
rastanavaibhavaMbula( garaMguchu ninnu ga~raMga mettu nI
kaustubharatna saudhamuna( kaugiTipAn&puna vEMkaTESwarA!

Tuesday, July 8, 2008

అలమేల్మంగా శతకము -21 alamElmaMgA Satakamu -21

కుంకుమ కస్తురీ ప్రభ బుగుల్కొన( జెక్కుల( జార దివ్యతా
టంకమణిప్రభా ప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపగనె జల్లనె( జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ము( బులకాంకురకోటులు వేంకటేశ్వరా !


kuMkuma kasturI prabha bugulkona( jekkula( jAra divyatA
TaMkamaNiprabhA prativiDaMbamutO nalamElumaMga bhrU
jaMkela naMdaliMpagane jallane( jittamu nIku naMtalO
naMkana miMchu mimmu( bulakAMkurakOTulu vEMkaTESWarA !

అలమేల్మంగా శతకము -20 alamElmaMgA Satakamu -20

లలితపు కంకణాంకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం
బులు మణినీలకాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు
బ్బల ప్రెనువ్రేగుతో( దుఱుముభారముతో నిను( జేరవచ్చు నం
దెలు మెలనూలు ఘంటలు( బ్రతిధ్వనులీనగ వేంకటేశ్వరా !


lalitapu kaMkaNAMkaladhwani ghallani mrOya nuMgaraM
bulu maNinIlakAMtula prabhutwamutO nalamElumaMga gu
bbala prenuvrEgutO( du~rumubhAramutO ninu( jEravachchu naM
delu melanUlu ghaMTalu( bratidhwanulInaga vEMkaTESwarA !


Monday, July 7, 2008

అలమేల్మంగా శతకము -19 alamElmaMgA Satakamu -19


పక్ష్మలనేత్ర ! యోచిలకపల్కుల కల్కి ! సరోజవల్లి ! యో
లక్ష్మి లతాంగి యోబహుకళావతి యోయలమేలుమంగ నీ
సూక్ష్మ వివేక లీలలకు( జొక్కితి నంచు నఖేందువల్లికా
లక్ష్మివికాసత సతి(జెలంగగజేతువు వేంకటేశ్వరా !


pakshmalanEtra ! yOchilakapalkula kalki ! sarOjavalli ! yO
lakshmi latAMgi yObahukaLAvati yOyalamElumaMga nI
sUkshma vivEka lIlalaku( jokkiti naMchu nakhEMduvallikA
lakshmivikAsata sati(jelaMgagajEtuvu vEMkaTESwarA !

Sunday, July 6, 2008

అలమేల్మంగా శతకము -18 alamElmaMgA Satakamu -18


లోలవిలోలనేత్రకు( దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్
మేలిమి( జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్
నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను
న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా !


lOlavilOlanEtraku( daLukkuna ~reppalu vaMchi yettinan
mElimi( jekkuTaddamula mElamulai yalamElumaMgakun
nIlapayOdapuMdu~rumu niggutaTillatalE yaTaMchu nu
nmIlanimIlanaMbulake mettuvu nIvunu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -17 alamElmaMgA Satakamu -17

అతడె నీవు, నీవనగ నాతడు, నీపలుకే తలంపగా
నాతనిపల్కు 'నీ హృదయ మాతడె పో ' యలమేలుమంగ నీ
చేతిదె సర్వజంతువుల జీవనమంతయు నంచు సన్ముని
వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా !


ataDe nIvu, nIvanaga nAtaDu, nIpalukE talaMpagA
nAtanipalku 'nI hRdaya mAtaDe pO ' yalamElumaMga nI
chEtide sarwajaMtuvula jIvanamaMtayu naMchu sanmuni
vrAtamu sannutiMchu nanivAraNa nIsati vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -16 alamElmaMgA Satakamu -16

నించిన పంచదారలును నేతులు దేనెలు( గమ్మ గా(గ( దా
లించినకూరలున్ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్ప(గ నారగింతు నీ
మించిన వేయిచేతులను మేలములాడుచు వేంకటేశ్వరా !


niMchina paMchadAralunu nEtulu dEnelu( gamma gA(ga( dA
liMchinakUralun barimaLiMchaga nayyalamElumaMga va
DDiMchina nirmalAnnamulu DeMda melarpa(ga nAragiMtu nI
miMchina vEyichEtulanu mElamulADuchu vEMkaTESwarA !



related post:


అలమేల్మంగా శతకము -15 alamElmaMgA Satakamu -15

తలచు( గరంగు మైమఱచు( దన్మయ మందును జిత్తజాగ్నిని
న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ,
వలిగిననంతనే కడు( బ్రియంబిక నేమని చెప్పనేడువో
కలిగిన మింతయు( బ్రకాశము తోచెడు వేంకటేశ్వరా !


talachu( garaMgu maima~rachu( danmaya maMdunu jittajAgnini
nnalayuchu dUru nussuranu narmilitO nalamElumaMga nI,
valiginanaMtanE kaDu( briyaMbika nEmani cheppanEDuvO
kaligina miMtayu( brakASamu tOcheDu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -14: alamElmaMgA Satakamu -14

తొలకరిమించు తొయ్యలి వధూమణి చక్కని తల్లి మానినీ
తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ
సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్
పలుకగ నిన్నుజూచి నగు(బైకొని నీసతి వేంకటేశ్వరా!


tolakarimiMchu toyyali vadhUmaNi chakkani talli mAninI
tilakama dEvadEvuni satImaNi yOyalamElumaMga nI
solapulachUpulE vibhunichUpulaviMdu laTaMchu nechchelul
palukaga ninnujUchi nagu(baikoni nIsati vEMkaTESwarA!

అలమేల్మంగా శతకము -13: alamElmaMgA Satakamu -13

చెదిరిన చిన్ని లేగురులు చెక్కున జాఱగ ముద్దుమోముతో
వదలిన కొప్పుతోడ నిడువాలిక కన్నులు నిగ్గు దేఱగా
నుదుటున నిన్ను గూడి మహిమోన్నతితో నలమేలుమంగ నీ
యెదుట మనోజసంపదల నేగతి నుండెనొ వేంకటేశ్వరా!


chedirina chinni lEgurulu chekkuna jA~raga muddumOmutO
vadalina kopputODa niDuvAlika kannulu niggu dE~ragA
nuduTuna ninnu gUDi mahimOnnatitO nalamElumaMga nI
yeduTa manOjasaMpadala nEgati nuMDeno vEMkaTESwarA!

Wednesday, June 25, 2008

అలమేల్మంగా శతకము -12: alamElmaMgA Satakamu -12


తరుణి! మహా నిధానమ! సుధామయకూపసమస్తవైభవా
భరణమ! దేవదేవుని కృపామతి! యోయలమేలుమంగ! నీ
కరుణయు జాలు లోకముల( గావ(గ నంచు మునీంద్రులున్
సురల్ నిరతి నుతించి మ్రొక్కుదురు నీప్రియకాంతను వేంకటేశ్వరా !


taruNi! mahA nidhAnama! sudhAmayakUpasamastavaibhavA
bharaNama! dEvadEvuni kRpAmati! yOyalamElumaMga! nI
karuNayu jAlu lOkamula( gAva(ga naMchu munIMdrulun
sural nirati nutiMchi mrokkuduru nIpriyakAMtanu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము -11: alamElmaMgA Satakamu -11


చ.సరసిజసంభవాది దివిజప్రకరంబులసంపదల్ సువి
స్తరములు గా(గ( గన్గొనల జల్లెడు శ్రీ యలమేలుమంగ నీ
తరుణి యురంబునం జెలగ(దన్మయ మందెడు నీకు బ్రాతియే
పరమపద ప్రభుత్వము నపారమహత్త్వము వేంకటేశ్వరా !


cha.sarasijasaMbhavAdi divijaprakaraMbulasaMpadal suvi
staramulu gA(ga( gan&gonala jalleDu SrI yalamElumaMga nI
taruNi yuraMbunaM jelaga(danmaya maMdeDu nIku brAtiyE
paramapada prabhutwamu napAramahattwamu vEMkaTESwarA !

Friday, June 20, 2008

అలమేల్మంగా శతకము -10 alamElmaMgA Satakamu -10

ఉ:కిన్నెర మీటి మీటి పులకించి తలంచి మనోజలీల( దా
నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యన(జెప్పగబూను( జెప్పరా
కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ
వన్నెలసేత లెట్టివొ సువాళము లెట్టివొ వేంకటేశ్వరా !


u:kinnera mITi mITi pulakiMchi talaMchi manOjalIla( dA
nunna te~raMgu nechchelula koyyana(jeppagabUnu( jepparA
kannuva siggutO nalaru nallana SrIyalamElumaMga nI
vannelasEta leTTivo suvALamu leTTivo vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము - 9 : alamElmaMgA Satakamu - 9

ఉ:ఆయలసంబు లానడపు లాకను(గ్రేవల ముద్దుచూపు లా
యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీకలమేలుమంగ నీ
మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేతలొ చెప్పు మంచు లే(
బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా !


u:AyalasaMbu lAnaDapu lAkanu(grEvala mudduchUpu lA
yAyelanavvu mATala priyaMbulu nIkalamElumaMga nI
mAyalo prANavallabhuni makkuva chEtalo cheppu maMchu lE(
brAyapu nIsatiM jelulu palkiri palma~ru vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము - 8 : alamElmaMgA Satakamu - 8

ఉ:కూరిమి సానవట్టిన చకోరపు(గన్ను(గొన దళుక్కునన్
జేరువ మించులై మెఱయ జిమ్ములబొమ్మల( బంపు నవ్వు దై
వారగ( గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ
సారపు నేర్పు( జక్కగొనె( జక్కని మోమున వేంకటేశ్వరా !

u:
kUrimi sAnavaTTina chakOrapu(gannu(gona daLukkunan
jEruva miMchulai me~raya jimmulabommala( baMpu navvu dai
vAraga( gAMchi nItaruNi vannela SrIyalamElumaMga nI
sArapu nErpu( jakkagone( jakkani mOmuna vEMkaTESwarA !




అలమేల్మంగా శతకము - 7 : alamElmaMgA Satakamu - 7

చ.ఒకమరి నీవు కన్గొనల నొయ్యన(జూచిన నీవిభుండు లో(
గకవిక( దర్చు( జేరునట కౌగిటి కోయలమేలుమంగ నీ
వికచ విలాస మంచు నరవిందమరందపు(దేనెపల్కులన్
బికశుకపంక్తి నీకు( దలపించును నీసతి వేంకటేశ్వరా!


cha.okamari nIvu kan&gonala noyyana(jUchina nIvibhuMDu lO(
gakavika( darchu( jErunaTa kaugiTi kOyalamElumaMga nI
vikacha vilAsa maMchu naraviMdamaraMdapu(dEnepalkulan
bikaSukapaMkti nIku( dalapiMchunu nIsati vEMkaTESwarA!

అలమేల్మంగా శతకము - 6 : alamElmaMgA Satakamu - 6

చ.చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా
ధికునియురముపై రతుల(దేలుచు శ్రీయలమేలుమంగ నీ
లికుచకుచ ప్రభావమున లేతవయస్సున నింత నేతురా
వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా !


cha.chikurabharaMbuchE (nadimi) SrIlalitAMgivi nIvu nAguNA
dhikuniyuramupai ratula(dEluchu SrIyalamElumaMga nI
likuchakucha prabhAvamuna lEtavayassuna niMta nEturA
vekali vaTaMDru nechchelulu vEDkala nIsati vEMkaTESwarA !

Monday, June 16, 2008

అలమేల్మంగా శతకము - 5 : alamElmaMgA Satakamu - 5

ఉ:
యో లలితాంగి ! యో కలికి ! యో యెలజవ్వని ! యో వధూటి ! యో
గోల ! మెఱుంగుజూపుకనుగోనల నోయలమేలుమంగ మ
మ్మేలిన తల్లి నీవిభున కించుక మాదెసచూపుమంచు నీ
పాలికి జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా !


u:yO lalitaaMgi ! yO kaliki ! yO yelajavvani ! yO vadhUTi ! yO
gOla ! me~ruMgujUpukanugOnala nOyalamElumaMga ma
mmaelina talli nIvibhuna kiMchuka mAdesachUpumaMchu nI
pAliki jEri mrokkuduru padmabhavAdulu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము - 4 : alamElmaMgA Satakamu - 4

ఉ:నీవును దాను గూడె దరుణీమణి శ్రీయలమేలుమంగ నా
నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేడు నీ
వావలి మోము చేసి తని యప్పటినుండియు( బల్క విట్టులా
దేవర చిత్తమెవ్వరికి (దేర్పగ శక్యమె వేంకటేశ్వరా !


u:nIvunu dAnu gUDe daruNImaNi SrIyalamElumaMga nA
nAvidhavaibhavaMbula nanAratamuM jeluvoMdu nEDu nI
vAvali mOmu chEsi tani yappaTinuMDiyu( balka viTTulA
dEvara chittamevvariki (dErpaga Sakyame vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము - 3 : alamElmaMgA Satakamu - 3

చ . కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ
పలుకుతేనెలన్ విభుని(బట్టము( గట్టితి నీదుకౌగిటన్
వలదని చెప్పినన్ వినవు వద్దుసుమీ యలమేలుమంగ నీ
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా !


cha . kilakila navvu navvi tilakiMchiti maMchi sudhArasaMbu nI
palukutEnelan vibhuni(baTTamu( gaTTiti nIdukaugiTan
valadani cheppinan vinavu vaddusumI yalamElumaMga nI
kelavu laTaMchu nechchelulu kIrtana sEturu vEMkaTESwarA !

Sunday, June 8, 2008

అలమేల్మంగా శతకము - 2 : alamElmaMgA Satakamu - 2


కన్నులుగల్గి కొమ్మ నిను గప్పము( జేకొన లేతనవ్వు నీ
కెన్నడు మోవి నిచ్చినదొ యేగతి మెచ్చితొ యెట్టులుండెనో
యన్నిట, నేనెజాణ నని యందువు శ్రీయలమేలుమంగకే
మన్నన నెట్టు లిచ్చితివొ మాటల జిక్కవు వేంకటేశ్వరా !


kannulugalgi komma ninu gappamu( jEkona lEtanavvu nI
kennaDu mOvi nichchinado yEgati mechchito yeTTuluMDenO
yanniTa, nEnejANa nani yaMduvu SrIyalamElumaMgakE
mannana neTTu lichchitivo mATala jikkavu vEMkaTESwarA !

అలమేల్మంగా శతకము - 1 : alamElmaMgA Satakamu - 1

శ్రీసతి నీలజాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱు(న్)
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
మూసిన ముత్యమై యురము ముంగిట( జెంగట వేంకటేశ్వరా !


SrIsati nIlajAMbavati SrIyamunAsati satyabhAma dhA
trIsati rukmiNIramaNi dEviyilAsati vIra laMdaru
jEsinasEva chEsedanu jEkonu SrIyalamElumaMga nI
mUsina mutyamai yuramu muMgiTa( jeMgaTa vEMkaTESwarA !